పేదరిక నిర్మూలనలో, ఎగుమతుల సన్నద్ధతలో ఏపీ ముందడుగు – విజయసాయిరెడ్డి

-

పేదరిక నిర్మూలనలో, ఎగుమతుల సన్నద్ధతలో ఏపీ ముందడుగు వేసిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో బహుముఖీయ పేదరికం నుంచి 30.02 లక్షల మంది బయటపడ్డారని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఐదేళ్ల కాలంలో (2015–16…2019–2021) ఆంధ్ర రాష్ట్రంలో దారిద్య్రం తగ్గిన వివరాలు సోమవారం వెల్లడయ్యాయన్నారు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే–4 ఐదు సంవత్సరాల క్రితం (2015–2016) ఆంధ్రప్రదేశ్‌ లో పేదల సంఖ్య 11.77 శాతం అని తెలిపారు.

తర్వాత ఐదేళ్ల కాలంలో జరిగిన పేదరిక నిర్మూలన కృషి వల్ల 2019–2021 నాటికి రాష్ట్రంలో దారిద్య్ర రేఖ దిగువున ఉన్నవారి సంఖ్య 6.06 శాతానికి తగ్గిందని జాతీయ కుటుంబ సర్వే–5లో తేలింది. అంటే ఆంధ్రలో ఈ ఐదేళ్ల కాలంలో 5.71 శాతం మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. దేశంలో పేదల సంఖ్య తగ్గించిన రాష్ట్రాల జాబితాలో నిష్పత్తిపరంగా ఏపీ 17వ స్థానంలో ఉంది. విద్య, వైద్యం వంటి 12 అంశాల ఆధారంగా ఈ కుటుంబ సర్వేలను నిర్వహించారు. జాతీయ బహుముఖీయ పేదరిక సూచీ–ప్రగతి సమీక్ష–2023 పేరుతో రూపొందించిన దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్, అరవింద్‌ విర్మాణీ, సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు సుమన్‌ భేరీ నిన్న విడుదల చేశారు. అధికంగా తగ్గిన పేదల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉందని పోస్ట్‌ పెట్టారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version