ఒకే స్క్రీన్​పై మహేశ్, సితార.. వీడియో వైరల్

-

టాలీవుడ్  సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన కుమార్తె సితార ఇప్పటికే బుల్లితెరపై షోలో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఈ తండ్రీకూతురు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి రీసెంట్​గా ఓ యాడ్ లో నటించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మహేశ్, సితారను చూసి అసలు వాళ్లు తండ్రీకూతురులా లేరని.. అన్నాచెల్లిలాగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ ్వుతోంది.

ఇక ఈ వీడియోలో ‘షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా’ అంటూ మహేశ్ అన‌గానే, ‘అవును నాన్నా’ అంటూ సితార ఆయనపై ఓ డ్రెస్ విసిరేయగా మహేశ్ కాస్ట్యూమ్ మారిపోతుంది. అలా తండ్రీకూతుళ్లు సరికొత్త ఔట్ ఫిట్లలో ఈ యాడ్లో కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియోలో మహేశ్ బాబు గడ్డంతో క్లాసీ లుక్ లో కనిపించి సందడి చేశారు. ఇక సితార తన నటన, స్క్రీన్ ప్రజెన్స్ తో నెటిజన్లను ఫిదా చేసింది. మరి మీరు కూడా ఈ తండ్రీకూతురి వీడియో ఓసారి చూసేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read more RELATED
Recommended to you

Latest news