గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కంటే తనతో ఎక్కువ మంది ఫొటోలు దిగుతారని ఆయన అన్నారు. బాలయ్య రోజుకొకర్ని కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు. అలాంటయన సినిమాలు ఎవరు చూస్తారు.. ఆయన సినిమాలకు అయినా కలెక్షన్స్ వస్తాయట అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌ఛాట్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా మంత్రి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు దోచుకుని తినడం తప్ప ఏం తెలియదంటూ సంచలన ఆరోపణలు చేశారు. మాటలతోనే వాళ్లకు బతకడం అలవాటైందని.. కేటీఆర్ తండ్రిచాటు కొడుకు, హరీష్ రావు మామ చాటు అల్లుడు అంటూ వ్యాఖ్యానించారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపారు.