నేను కాల్చింది ఆయుర్వేదిక్‌ బీడీలు.. ‘గుంటూరు కారం’లో స్మోకింగ్‌పై మహేశ్‌

-

టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరిస్తూ, బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్బాబు తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో మహేశ్బాబు చాలా సార్లు బీడీలు కాలుస్తూ కనిపించారు. అయితే తాను రియల్ లైఫ్లో స్మోకింగ్ చేయనని.. దాన్ని సినిమాల్లో కూడా ప్రోత్సహించనని చెప్పారు. అయితే ఈ మూవీలో తాను తాగింది నిజమైన పొగాకు బీడీ కాదని అసలు సంగతి చెప్పుకొచ్చారు. తాను మూవీలో కాల్చింది ఆయుర్వేదిక్‌ బీడీ అని మహేశ్ బాబు అన్నారు. లవంగం ఆకులతో దాన్ని తయారు చేశారని, అందులో ఎలాంటి టుబాకో ఉండదని తెలిపారు. మింట్ ఫ్లేవర్‌లో ఉండటంతో సౌకర్యవంతంగా షూటింగ్‌ చేసేందుకు వీలైందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news