ఫ్రెండ్ పార్టీలో మహేశ్ బాబు సందడి.. ఫొటోలు వైరల్

-

మహేశ్ బాబు ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుందని అందరికీ తెలిసిందే. చూడ్డానికి సైలెంట్​గా ఉన్నా.. టైం చూసి పంచ్​లు వేస్తాడు. ఇక ఫ్రెండ్ సర్కిల్​ ఉంటే ఈ సూపర్ స్టార్ అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్రెండ్ పార్టీకి ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. ఈ పార్టీలో మహేశ్ చాలా అల్లరి చేశాడంటూ తన భార్య నమ్రత సోషల్ మీడియాలో ఆ ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మహేశ్ బాబు చాలా సందడిగా కనిపించాడు. ఇక ఈ స్టార్ అందం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కొత్త లుక్​లో చాలా హ్యాండ్సమ్​గా కనిపించాడు మహేశ్.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహేశ్ బాబు అందాన్ని చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ‘సో క్యూట్‌, సూపర్‌ అన్నా, ఏం ఉన్నాడు మా అన్నయ్య!’ అని కొందరు కామెంట్లు పెడితే.. ‘మహేశ్‌ నువ్వింకా 20లోనే ఉన్నావ్‌, సూపర్‌ స్మైల్‌, మీరు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా?’ అంటూ మరికొందరు అంటూ వ్యాఖ్యలు జోడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version