ఆ రాష్ట్రంలో అందరికీ ‘ఫ్రీ’గా హై స్పీడ్ ఇంటర్నెట్​ ​

-

పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది కేరళ సర్కార్. ఏకంగా 20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్​ అందించేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా చేపట్టిన కే-ఫోన్​ (కేరళ ఫైబర్ ఆప్టిక్​ నెట్​వర్క్​) ప్రాజెక్టును సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చౌక ధరలకు ఇంటర్నెట్​ను అందించనున్నారు.

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ధరలకన్నా.. తక్కువ ధరలకే ఇంటర్నెట్​ను అదిస్తామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. కే-ఫోన్​లో పాజెక్టు మొదటి దశలో భాగంగా 14 వేల ఇళ్లకు ఇంటర్నెట్​ కనెక్షన్​ ఇవ్వనున్నారు. అందులో తొలుత ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఇంటర్నెట్​ సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన ​20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్​ సేవలను అందిస్తామని కేరళ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే కే-ఫోన్​ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే ఎక్కడైనా హై స్పీడ్​ ఇంటర్నెట్​ను వినియోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version