ప్రిన్స్ మ‌హేశ్ : అనిల్ తో మ‌రో సారి.. రిస్క్ లేని జాబ్ క‌దా !

-

త్రివిక్ర‌మ్ కానీ అనిల్ రావిపూడి కానీ మ‌హేశ్ కు న‌చ్చుతారు. ఖ‌లేజా ఫ్లాప్ అయినా ఆ సినిమా ప‌రంగా మ‌హేశ్ ఎంతో బాగా చేశాడు అన్న టాక్ మాత్రం అభిమానుల్లో అలానే ఉండిపోయింది. అంత‌కుమునుపు చేసిన అత‌డు ఆయ‌న స్థాయిని పెంచింది. ఆ విధంగా త్రివిక్ర‌మ్ మ‌రోసారి, కుర్ర డైరెక్ట‌ర్ అనిల్ తో ఇంకో సారి జోడీ క‌ట్టేందుకు మ‌హేశ్ బాబు సిద్ధం అవుతున్నారు. మూవీ ఫార్ములాల‌కు అనుగుణంగా సినిమాలు తీసే అనిల్ ఇక‌పై కూడా అదే సూత్రం కొన‌సాగిస్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అన్నాడు. ఆ విధంగా ఓ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఆయ‌న్నుంచి మ‌రోసారి అభిమానులు ఆశించ‌వ‌చ్చు. ఆ వివ‌రం ఈ కథనంలో..

మహేష్ బాబు.. ఈ పేరులో ఏదో తెలియని మత్తు ఉంది.. అమ్మాయిలు అందరు మహేశ్ సినిమాకు సంబంధించిన వార్త‌లు అంటే తెగ శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఇదే స‌మ‌యంలో ఆయన చేసిన సినిమాలు కూడా అమ్మాయిలకు తెగ నచ్చుతాయి. వయస్సు పెరిగినా తరగని అందం మహేష్ సొంతం. అందుకే ఆయ‌న‌కు సినిమా సినిమాకూ అభిమానుల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడంలేదు.. ఇకపోతే మహేష్ బాబు సినిమాల ప్లానింగ్ , క‌మిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు లేదు..ఒక సినిమా లైన్లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేసుకుంది..ఆ సినిమా మే 12 న వేసవి కానుకగా ప్రెక్షకుల ముందుకు రానుంది. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు..

మాటల మాంత్రికుడు త్రివికమ్ తో ఒక సినిమా చేయనున్నారు.. ఆ సినిమా తర్వాత జక్కన్న తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేశారని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఇతనితో మహేష్ ఇప్పటికే మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు` సినిమా చేశాడు. 2020లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ నేప‌థ్యాన ఆయ‌న‌కు మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల మహేశ్‌కి తాను ఒక కథను చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింద నీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫుల్ బిజిగా ఉన్నారు. ఈ ఇద్దరు చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలు అయిన తర్వాతే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్ల‌నుంది..అనిల్ ఎఫ్3 చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బాలయ్య తో మరో సినిమా చేయనున్నారు.. ఆ తర్వాత మహేశ్‌తో సినిమా చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version