టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆ సినిమాలను ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టకుండా ఉంటాయి. అలాంటి సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మూవీ ఒకటి. 2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు, బ్రహ్మానందం కామెడీ, డైరెక్టర్ టేకింగ్ అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మరో విశేషం ఏంటంటే..? బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారమైన మూవీగా ‘అతడు’ సినిమా పేరిట రికార్డు నమోదైంది.
ఈ చిత్రం దాదాపు 20 సంవత్సరాల తరువాత మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ఒక్కడు, మురారి, ఖలేజా వంటి సినిమాలు రీ రిలీజ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ తరుణంలోనే మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 09న ‘అతడు’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు అదే రోజు రాఖీ పండుగ కావడం విశేషం. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే.. ఇన్నేళ్ల తరువాత కూడా ఈ చిత్రానికి క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సిస్ లో సైతం ‘అతడు’ మూవీకి బుకింగ్స్ భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల కంటే కూడా అతడు సినిమాకి బుకింగ్స్ బాగున్నాయంటే.. ఈ సినిమాకి ట్రెండ్ ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి 70MM స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతను రీ రిలీజ్ 4K థియేట్రికల్ రైట్స్ ని రూ.3కోట్లకు పైగా కొనుగోల్ చేసినట్టు సమాచారం. నైజాంలో ఈ చిత్రాన్నని ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. ఏపీ ఏరియాల వారికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ధర వెచ్చించి ‘అతడు ‘ రీ రిలీజ్ రైట్స్ కొనుగోలు చేశారు. ఓవైపు మహేష్ బాబు బర్త్ డే.. మరోవైపు వీకెండ్, రాఖీ పౌర్ణమీ.. వీటికి తోడు సినిమాలు ఏవి లేకపోవడంతో అతడు రీ రిలీజ్ లో రికార్డు స్థాయి నెంబర్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. మహేష్ బాబు అతడు మూవీ రీ రిలీజ్ లో ఎన్నికోట్లు వసూలు చేస్తుందో వేచి చూద్దాం.