రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న మహేష్ మూవీ.. ఫాన్స్ కి ఇక పండగే..!

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు సినిమాని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో బిజినెస్ మాన్ సినిమా కూడా ఒకటి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఆటిట్యూడ్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు ఈ సినిమాతో మాస్ హీరోగా కూడా మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక మరొకవైపు బిజినెస్ మాన్ కి ముందు పూరీ జగన్నాథ్ నేను నా రాక్షసి, హిందీలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ వంటి సినిమాలు చేసి డిజాస్టర్ గా నిలవగా.. ఆ తర్వాత పట్టుదలతో బిజినెస్ మాన్ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అప్పట్లో మంచి కలెక్షన్లు సాధించిన కారణంగా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మాన్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారట. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు అన్నదానాలు, రక్తదానాలతో పాటు ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా అదే రోజు మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కూడా అప్డేట్ రాబోతోంది. మొత్తానికైతే ఆరోజు మహేష్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version