ఎడిట్ నోట్: కమలం కలహాల కథలు.!

-

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలహాలు..అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండేవి..అసలు ఆ పార్టీ నేతలు ప్రతిసారి మీడియాకు ఎక్కి..ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునేవారు. మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ లో అదే పంచాయితీ నడిచింది. కానీ ఈ మధ్యే కాస్త తగ్గింది. అలా అని ఆ పార్టీలో కలహాలు లేకుండా ఉండవు. అందులో ఎప్పుడు అంతర్గత పోరు మామూలే.

కానీ బి‌జే‌పిలో ఎప్పుడు అలాంటి పరిస్తితులు ఉండవు. ఒకవేళ అంతర్గతంగా పోరు ఉన్నా సరే అధిష్టానం బయటపడనివ్వదు..నేతలకు సర్ది చెప్పి తగ్గించేస్తుంది. నేతలు కూడా బహిరంగంగా మీడియా ముందుకొచ్చి తిట్టుకోరు. కానీ ఇప్పుడు పరిస్తితి అలా లేదు..నేతలు మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ బి‌జే‌పికి పెద్ద తలనొప్పిగా మారాయి. వరుసగా కలహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఈటల రాజేందర్ పార్టీలో చేరికల విషయం లో వన్ సైడ్ గా వెళ్ళడం..వాటి గురించి తనకు తెలియదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేయడం సంచలనమైంది. వారిద్దరికి పడటం లేదని తెలిసింది.

ఇదే క్రమంలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బి‌జే‌పి కార్యక్రమాలకు దూరంగా ఉండటం..వారికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం..ఆ తర్వాత మళ్ళీ యాక్టివ్ అవ్వడం జరిగాయి. తర్వాత నుంచి పార్టీ పదవుల్లో మార్పులు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా తొలగిస్తున్నారని ప్రచారం వచ్చింది. ఇదే సమయంలో జితేందర్ రెడ్డి..బండిని ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేశారు. రాష్ట్ర నాయకత్వానికి ట్రీట్‌మెంట్ కావాలని అన్నారు. తర్వాత మాట మార్చి..తాను అలా అనలేదని అన్నారు.

ఇక నాయకత్వం మార్పుపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్న క్రమంలోనే రఘునందన్ డిల్లీ వేదికగానే బండి పై ఫైర్ అయ్యారు. బండికి కళ్ళు నెత్తికెక్కాయని, అహంకారం పెరిగిందని, ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదని అన్నారు. మళ్ళీ తర్వాత తాను ఏదో సరదాగా అన్నానని మాట మార్చారు. ఇలా బి‌జే‌పిలో ఊహించని కలహాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో అర్ధం కాకుండా ఉంది.

అయితే బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని..కిషన్ రెడ్డిని రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడుగా చేస్తారని అంటున్నారు..అటు ఈటలని ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ చేస్తారని చెబుతున్నారు. మరి ఈ మార్పుల తర్వాతైన కమలంలో కలహాలు ఆగుతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version