మజిలీ డైరక్టర్.. డబుల్ హ్యాపీనెస్..!

-

నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. ఉగాదికి ఒకరోజు ముందు రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా తొలి వీకెండ్ వసూళ్లు బ్రాహ్మండంగా ఉండగా మరో రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చి పెడతాయని తెలుస్తుంది. నిన్నుకోరి తర్వాత మజిలీతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న శివ నిర్వాణ సినిమా సక్సెస్ తో పాటుగా పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ కొత్త మలుపుతో ఇంకాస్త ఆనందంగా ఉన్నాడు.

ఓ పక్క తన డైరక్షన్ లో సినిమా హిట్టైనందుకు సంబరపడుతుండగా మరోపక్క తనకి కొడుకు పుట్టాడన్న వార్తని ప్రేక్షకులతో పంచుకున్నాడు శివ నిర్వాణ. సినిమా హిట్ అవడమే కాదు వారసుడు వచ్చాడన్న ఆనందం కూడా శివ నిర్వాణని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకే కొడుకు పుట్టాడన్న విషయాన్ని చెప్పి ఇంతకుమించి ఏమి అడగొద్దు అని ట్వీట్ చేశాడు. శివకి కొడుకు పుట్టాడన్న విషయం తెలుసుకున్న చైతు, సమంతలు అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. బుడతడు రావడం రావడమే తండ్రికి సూపర్ సక్సెస్ తెచ్చాడని అందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news