శాకుంతలంలో ఈ లెక్కలు మరిచిన గుణ శేఖర్..

-

సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం సినిమా విడుదలై అంచనాలను తలకిందులు చేసింది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా చివరికి విడుదలై నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా పరాజయానికి ఇవే కారణం అంటూ విశ్లేషణ చేస్తున్నారు సినీ విమర్శకులు.

సమంతల శకుంతలంలో కొన్ని విషయాలు కచ్చితంగా దారి తప్పయనే అంటున్నారు విశ్లేషకులు.. నిజానికి శాకుంతల అంటేనే అపూర్వ అందగత్తె, శృంగార నాయిక. ఆమెను చూసిన వెంటనే దుష్యంతుడు మైమరిచిపోయి అప్పటికప్పుడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అంతటి అందం ఆమె సొంతం. అయితే సినిమాలో మాత్రం ఆమెని అందంగా చూపించకపోగా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు చూపించడం నిజంగా సినిమాకి మైనస్ గానే మారింది. అలాగే ఇలాంటి కథలకు ప్రధాన పాత్ర ధారుల డబ్బింగ్ బాగుండాలి. కానీ సమంత తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఈ సినిమాకు అంతగా సెట్ కాలేదని తెలుస్తోంది.

 

సినిమాలో ఫోకస్ పెంచాల్సిన అంశం దుష్యంతుడు, శకుంతల ప్రేమ వ్యవహారం. కానీ ఈ విషయానికి సినిమాలో అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే సమంత పక్కన దేవ్ మోహన్ కనిపించలేదని చెప్పాలి. కొంచెం ఫేమ్ ఉన్న ఈ హీరోని తీసుకున్న బహుశా వేరే రకంగా ఉండేదేమో. అలాగే మేనక అంటే రాజర్షులు, బ్రహ్మర్షులే సన్యాసాన్ని వదిలేసేంత అందగత్తె. కానీ ఈ సినిమాలో మేనకగా మధుబాల అస్సలు సెట్ కాలేదు. అలాగే సినిమాలో త్రీడీ పనితనం సైతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాటలు సైతం అలరించకపోగా హిందీ డబ్బింగ్ సినిమాలో ఉన్నట్టు అనిపించడం మరింత ఇబ్బంది కలిగించింది. ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. దుష్యంతుడు, శకుంతల బిడ్డగా కనిపించే అల్లు అర్హ తెలుగును స్పష్టంగా పలుకుతూ తన నటనతో సినిమాకి ప్లస్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news