BREAKING : నటుడు మోహన్‌ లాల్‌కు అస్వస్థత!

-

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ అస్వస్థతకు గురైనట్టు మాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన్ను కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. రద్దీ ప్రదేశాలతోపాటు షూటింగ్స్ కు కొన్ని రోజులపాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు.

మోహన్ లాల్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆస్పత్రి నుంచి క్షేమంగా రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ లాలెట్టా అంటూ ఆయన కోసం ప్రార్థిస్తున్నారు.  మోహన్ లాల్ వివిధ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరితమే. జనతాగ్యారేజ్ సినిమాతో టాలీవుడ్ కు ఆయన మరింత దగ్గరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news