ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటులు మరణించగా.. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడి తండ్రి మరణించారు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా కొనసాగుతున్న టామ్ తండ్రి సిపి చాకో మృతి చెందారు.

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో చాకో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. చాకో అలాగే అతని తల్లికి అటు సోదరుడు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా దసరా అలాగే దేవర సినిమాలతో చాకో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.