మమతామోహన్ దాస్ బర్త్ డే స్పెషల్.. Live మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-

యమదొంగ, చింతకాయల రవి, కింగ్‌, కేడి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ కుట్టి మమతామోహన్ దాస్. ఈ బ్యూటీ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. చాలా రోజుల తర్వాత తెలుగులో రుద్రాంగి అనే మూవీతో కమ్ బ్యాక్ ఇస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ క్యూటీ పుట్టిన రోజు ఇవాళ.

ఈ బ్యూటీ బర్త్ డే స్పెషల్ గా ఇవాళ తన కొత్త మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.  మమతా మోహన్‌ దాస్‌ తాజాగా మలయాళంలో సోషల్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నటిస్తోన్న చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ను పెట్టారు. ఈ మూవీ టైటిల్ లైవ్‌ (Live) ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మీడియా వ్యక్తులంతా రౌండప్ చేసినట్టు కనిపిస్తున్న ఫస్ట్‌ లుక్‌.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

రెగ్యులర్‌ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. ఫిలిమ్స్‌ 24 బ్యానర్‌పై దర్పన్‌ బంగేజా, నితిన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అల్ఫోన్స్‌ జోసెఫ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌. శౌబిన్‌ షాహిర్‌, షినే టామ్‌ ఛకో, ప్రియా వారియర్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీకే ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తుండగా ఎస్‌ సురేశ్‌ బాబు కథను అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version