జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 మెడికల్ కాలేజీ లలో విద్యా బోధన తరగతులను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
జగిత్యాల, వనపర్తి, మహబూబ్నగర్, సంగారెడ్డి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండం లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఎంబిబిఎస్ తొలి విద్యా సంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రేపు ప్రారంభం కానుంది. అలాగే త్వరలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.