‘అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’.. మంచు మనోజ్ మాస్ వార్నింగ్

-

చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ అన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్‌ వేదికగా ఘాటుగా పోస్ట్‌ పెట్టారు. చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందని అన్నారు. హాస్యం ముసుగులో సోషల్‌ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్నారని ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరమైందని తెలిపారు.

“తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం నేను ఏడాది క్రితం ఇన్‌స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించాను. కానీ, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈరోజు అదే వ్యక్తి సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్‌ చేస్తున్నాడు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలి. దయచేసి ఇలాంటి వారిని ఉపేక్షించవద్దు” అంటూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు మనోజ్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ ‘అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను’ అని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version