ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేయడం జరిగింది ఏపీ సర్కార్. వచ్చేనెల అంటే మార్చి నుంచి… క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని… ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా సంఘంలో తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పాత కార్డులలో మార్పులు అలాగే చేర్పులకు అవకాశం… కల్పిస్తామని వివరించారు మంత్రి నాదేండ్ల మనోహర్.
అన్ని గ్రామాలన్నీ మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ప్రక్రియ ఉంటుందని.. ప్రకటన చేశారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. అదే సమయంలో.. మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల పెండింగ్ రవాణా చార్జీలను, హమాలి చార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని కూడా వివరించారు.