బుల్లితెరపై మంచు మనోజ్ ఎంట్రీ.. ‘ఉస్తాద్’ షోతో ఫ్యాన్స్​కు గిఫ్ట్

-

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే గేమ్ షోతో ఆయన ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఆయన భార్య మౌనిక ఈ ప్రోగ్రామ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్​కు హోస్ట్ మనోజ్ ఫ్యామిలీ సహా, నిర్మాత వివేక్ కుచిబొట్ల, రైటర్ బీవీఎస్ రవి, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, పలువురు సెలబ్రిటీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్​లో ప్రసారం కానున్న ఈ షోతో మనోజ్ తొలిసారిగా హోస్ట్​గా వ్యవహరించారు. ఈ గేమ్​ షో పలు సీజన్​ల వారీగా ప్రసారం కానుంది. గేమ్​ షోకు ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చారన్న విషయం బయటకు వెల్లడించలేదు.

2017 నుంచి మనోజ్​ నుంచి సినిమాలు రాలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన ఆడియన్స్​ను పలకరించబోతున్నారు. తిరిగొస్తున్నా. నేను మిస్​ అయిన నా మచ్చాస్ (ఫ్రెండ్స్​)ని కలిసేందుకు, నన్ను మిస్ అయిన చిచ్చాస్ (ఫ్యాన్స్​)ని పలకరించేందుకు రేపు కలుద్దాం. ఇక కలుస్తూనే ఉందాం’ అని  ట్వీట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోగ్రామ్ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news