ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో కొత్తగా రూ.31,161 కోట్ల పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం జరిగింది. ఐటీ కంపెనీ లకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేయనుంది.

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనకు SIPB అంగీకారం తెలిపింది. కొత్తగా రూ.31,161 కోట్ల పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్ అందుబాటులోకి రానుంది. పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్ర స్థాయిలో కనిపించాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.