మంచు ఫ్యామిలీలో గత మూడు రోజులు గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదం నేపథ్యంలో సినీ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు రాచకొండ కమిషనరేట్ కు చేరుకున్నారు. నేరెడ్ మెట్ లోని సీపీ ఆఫీస్ లో జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సమక్షంలో సీపీ సుధీర్ బాబు విచారిస్తున్నారు.మంచు విష్ణు రూ.లక్ష బాండ్ సమర్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని తెలిపారు. మరోవైపు మంచు మోహన్ బాబు బేషరతుగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ ఉదయం మంచు మనోజ్ విచారణ చేశారు. విచారణ తరువాత మంచు మనోజ్ రూ.లక్ష బాండ్ సమర్పించారు. ఫ్యామిలీ వివాదంలో జరిగిన ఘటనలపై తాను వివరణ ఇచ్చుకున్నారు. తనంతట తాను గొడవలకు దిగనని మనోజ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూర్చొని మాట్లాడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు మంచు మనోజ్. తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.