ఇసుక విషయంలో అధికారులదే బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి.. అందరికీ కూడా క్యాబినెట్ కొలిగ్స్ కి కానీ ఎమ్మెల్యేలు, అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. మేము చెప్పాల్సింది చెప్పేశాం. ఇక అధికారులదే బాధ్యత అని.. అడ్మినిస్ట్రేషన్ లో ఏపీ మోడల్ గా ఉండాలని కేంద్రం భావిస్తోంది.
ఐఏఎస్, ఐపీఎస్ లు వ్యవస్థను బలోపేతం చేయాలి. మీరు నిస్సహాయతతో చూస్తుంటే.. సగటు మనిషి ఎక్కడికి వెళ్తారో చెప్పండి. మీరు బాధ్యత తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఇసుక విషయంలో చంద్రబాబు మొత్తుకుంటున్నారు. ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి అన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఏ స్థాయికి వెళ్లాయంటే.. అన్ని వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వివరించారు. వీటిని సరిదిద్దుకోవడానికి, తాము అన్ని విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు కదిలామని పవన్ వివరించారు.