ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 హవా కొనసాగుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ తాజాగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే రూ.1002 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కల్కీ2898 ఏడీ తరువాత భారీ వసూల్లను రాబట్టిన తెలుగు చిత్రం పుష్ప-2నే కావడం విశేషం. విడుదలైన 6 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయడం భారతీయ సినీ చరిత్రలో రికార్డు.. తొలిరోజు అత్యధిక వసూళ్లు 294 కోట్లు సాధించిన భారతీయ చలన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2 ది రూల్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా, సునిల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పహద్ పాజిల్ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన అద్భుతమని సినీ ప్రియులు పేర్కొంటున్నారు.