నరేష్ తో పెళ్ళి..స్ట్రింగ్ ఆపరేషన్ లో నిజం ఒప్పుకున్న పవిత్ర లోకేష్.. వీడియో వైరల్!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ తో కలిసి జంటగా ఎన్నో చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాలలో వీరిద్దరి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే గత కొద్ది రోజులుగా నరేష్ అలాగే పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ కూడా ఇటీవల ఒక స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇకపోతే నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త విన్న ఆయన మూడవ భార్యా రమ్య ఆయన నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదు అలా ఎలా నాలుగో వివాహం చేసుకుంటాడు అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కానీ పవిత్ర లోకేష్ కూడా ఇటీవల కన్నడ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ నరేష్ తో పెళ్లి విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే తెలుగులో ఇన్ని వార్తలు వస్తున్నా ఈ విషయాలపై స్పందించని పవిత్ర లోకేష్ కన్నడ ఇండస్ట్రీలో పలు కథనాలు రావడంతో ఆమె ఎట్టకేలకు స్పందించింది. ఆ కన్నడ న్యూస్ ఛానల్ పవిత్ర లోకేష్ పై స్ట్రింగ్ ఆపరేషన్ జరపగా ఆమె ఇందులో నిజంగానే నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు..

అంతేకాదు వీరిద్దరి సహజీవనానికి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కూడా అండగా ఉంది అని.. ఆయనతో పాటు వాళ్ళ ఇంట్లో నేను నరేష్ కూడా ఉంటున్నాము అని పవిత్ర లోకేష్ తమ రహస్యాన్ని బట్టబయలు చేసింది.ఇకపోతే ప్రస్తుతం కన్నడలో పీహెచ్డీ చేస్తున్నట్లు పవిత్ర లోకేష్ తెలిపారు. ఇకపోతే నరేష్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదు అని.. అంతేకాదు ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు కూడా తనకు అవసరం లేదు అని పవిత్ర లోకేష్ తెలియజేసింది.ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news