మాస్ మహారాజ్ రవితేజ సినిమాకు సూపర్ హైప్..!!

-

హీరో రవితేజ తనకు తానుగా కష్టపడి పైకి వచ్చిన హీరో. వెనక గాడ్ ఫాదర్ లేకున్నా కూడా తన దైన స్టైల్, టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తన గత సినిమా రామారావు ఆన్ డ్యూటీ అట్టర్ ప్లాప్ అయినా కూడా తనకు వరసగా సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే తాను మినిమం గ్యారెంటీ హీరో అలాగే ఆయన నిర్మాతల హీరో.ఇక తనకు సూపర్ హిట్ వచ్చే టైమ్ వచ్చిందని అంటున్నారు.

తాను నటించిన ధమాకా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగానిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్తా ఆలస్యం అయ్యింది. డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాకు హీరోయిన్ శ్రిలీల ప్లస్ కాబోతుంది. ముఖ్యంగా  ‘జింతాక్’  సాంగ్ కు మిలియన్ల వ్యూస్ దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 42 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. రవితేజ ఇటీవల సినిమాల్లో దీనికే ఎక్కువ దక్కడం విశేషం. మిగితా సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.ఇక రీసెంట్ విడుదైన ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. ట్రైలర్ లోని రవితేజ మాస్ డైలాగ్ లు, పంచ్ లు, మేనరిజం, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీనితో ఈ సినిమా పై  హైప్ బాగా క్రియేట్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version