మట్టిలేకుండా వ్యవసాయం.. ఏకంగా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి కుంకుమపువ్వు సాగు..!!

-

వ్యవసాయం సంప్రదాయం నుంచి ఆధునికానికి మెల్లగా మారుతోంది.. కొత్త కొత్త యంత్రాలు వచ్చాయి.. తక్కువ ప్లేస్‌లోనే ఎక్కవ పంటలను వేయగలుగుతున్నారు. సాధారణంగా ఏ పంట బాగా పండాలన్నా.. ఆ నేలలోనే మట్టి చాలా ముఖ్యమైనది.. భూమి సారవంతమైనదైతే.. పంట బాగా పండుతుంది.. కానీ ఇక్కడ ఓ రైతు అసలు మట్టే లేకుండా కుంకుమపువ్వు పండిస్తున్నాడు. కుంకుమపువ్వు ఎంత ఖరీదైనదో మనందరికీ తెలుసు..! అలాంటి సుగంద ద్రవ్యాన్ని మట్టిలేకుండా ఎలా పండిస్తున్నాడు.. అసలు నిజమైన కుంకుమపువ్వేనా..?
మహారాష్ట్రలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. సరికొత్త విధానంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. పుణెకు చెందిన శైలేష్ మోదక్ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. మంచి జీతం..విలాసవంతమైన జీవితం. కానీ అవి తనకు సంతృప్తిని ఇవ్వలేదు..శైలేష్‌కి వ్యవసాయంపై ఆసక్తి. ఐతే సంప్రదాయ పద్దతులు కాకుండా.. అధునాతన పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఏరోపోనిక్ విధానంలో ఇప్పటికే స్ట్రాబెర్రీ, కూరగాయలు పండిస్తున్న ఆయన.. ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తున్నాడు.
శైలేష్‌ ఏమంటున్నాడంటే.. ” మేం షిప్పింగ్ కంటైనర్‌లలో కుంకుమ పువ్వును సాగుచేస్తున్నాం. మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విధానంలో మొదట కూరగాయలు, స్ట్రాబెరీలను కూడా సాగు చేశాం. ఇప్పుడు కుంకుమ పువ్వును పండిస్తున్నాం. కుంకుమ పువ్వు సాగు కోసం నేను రూ.10 లక్షల పెట్టుబడి పెట్టా.. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ . కాశ్మీర్ నుంచి విత్తనాలను తీసుకొచ్చా. 160 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఏరోపోనిక్ టెక్నాలజీతో కుంకుమ పువ్వును సాగుచేస్తున్నా.” అని శైలేష్ అంటున్నాడు..
ఏరోపోనిక్ విధానం అంటే..
ఏరోపోనిక్ విధానంలో చిన్న చిన్న నీటి తుంపర్ల సాయంతో వ్యవసాయం చేస్తారు. ఈ తుంపర్లతో పొగమంచు ఏర్పడుతుంది. దీని నుంచే మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తారు. ఏరోపోనిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తే.. తక్కువ ప్రదేశంతో.. తక్కువ సమయంలో.. ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. చాలా దేశాల్లో ఈ టెక్నాలజీ ఉంది. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే కొందరు యువ రైతులు ఏరోపోనిక్ విధానంలో పంటలు పండిస్తూ.. అధిక లాభాలను అర్జిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version