సినిమా పారితోషికాల గురించి పార్లమెంటులో చర్చ ఏమిటి? : చిరంజీవి

-

సినిమా పరిధిని పెంచడానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరిశ్రమ ఉందంటే కారణం ఖర్చు పెట్టడమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ ఖర్చుకు తగ్గట్టుగా ఎంతో కొంత ఆదాయం రావాలని కోరుకోవడం సమంజసమని తెలిపారు. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి కానీ… అణగదొక్కాలని చూడకూడదు అంటూ చిరంజీవి ప్రభుత్వాల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. సినిమావాళ్లకి ఎక్కువ పారితోషికాలు ఇస్తున్నారని పార్లమెంటులో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్లకేమీ పనీపాటా లేదా అనిపిస్తోందంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.’ అని చురకలు అంటించారు. పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి తప్ప.. సినీ తారలు పారితోషికాలు తీసుకోవడం తప్పు అంటూ దేశవ్యాప్తంగా ఎత్తిచూపే ప్రయత్నం చేయొద్దని విన్నవించుకుంటున్నా’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version