Chiranjeevi: ఆ విషయాన్ని రెండు రాష్ట్రాలు మర్చిపోయాయి.. మెగాస్టార్ సెన్సెష‌నల్ కామెంట్స్

-

Chiranjeevi: సినిమాల‌కు రీఎంట్రీ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. యంగ్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. వారికి పోటీగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే కొరిటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆచార్య విడుద‌లకు సిద్ధంగా ఉంది. అలాగే.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంకర్ సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ బాబీ దర్శకత్వంలో మ‌రో సినిమా లో న‌టించడానికి సిద్దంగా ఉన్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రముఖ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి సినీ పరిశ్రమకి సంబంధించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలూ సినిమా కళాకారులకి అందించే అవార్డుల సంగతిని మరిచిపోయాయ‌ని.. ఇకపై రెండు రాష్ట్రాలూ ఆలోచించి సినీ అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహించాలని కోరారు.

కళాకారులకి అవార్డులు గొప్ప ఉత్సహాన్ని ఇచ్చే వేడుక. నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం నిర్వ‌హించాల‌ని, ఇక నుంచి అయినా.. ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే ప్రోత్స‌హ‌క‌రంగా ఉంటుంద‌ని చిరు త‌న‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. సినిమా రంగాన్ని, క‌ళాకారుల‌ను ప్రోత్సహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news