అదరగొడుతున్న చిరంజీవి 200 కోట్లతో వాల్తేరు వీరయ్య రికార్డ్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి 10 రోజులు అయినా  కూడా ఇంకా వసూళ్ళు వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 3 రోజుల్లో 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

ఈ విషయాన్ని తెలుపుతూ మైత్రీ మూవీ మేకర్స్ వారు 200 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకటే హంగామా చేస్తున్నారు. అలాగే బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి కలెక్షన్స్ అధికమించింది అని కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version