ధమాకా పల్సర్ బైక్ సాంగ్ వచ్చిందోచ్..!!

-

ఇప్పట్లో మాస్ మహారాజా రవితేజ అదృష్టం మామూలుగా లేదు. రీసెంట్ గా  వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయ్యింది.అలాగే తన సినిమా ధమాకా సినిమా తనకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది..నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

రవితేజ కు 100 కోట్ల హీరోగా నిలబడాలనుకున్న తన కలను సాకారం చేసింది. ఇక సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ  కూడా ధమాకా ఇంకా హౌస్ ఫుల్స్ అవుతూ ఉండడం విశేషం అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధమాకా కొన్ని థియేటర్స్ లోనే ప్రదర్శితం అవుతున్నప్పటికీ వాటిలో కూడా ఆల్ మోస్ట్ ఈ పండుగలో హౌస్ ఫుల్స్ పడ్డాయని ట్రేడ్ టాక్ గట్టిగా నడుస్తోంది.

ఇక రీసెంట్ గా ఓటిటి లో అడుగుబెట్టిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉండడం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో ప్రేక్షకుల తో విజిల్స్ వేపించిన పల్సర్ బైక్ సాంగ్ ను యూనిట్ వర్గాలు తాజాగా యుట్యూబ్ లో విడుదల చేశాయి. దానితో ప్యాన్స్ ఆనందం తో స్టెప్స్ వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version