తారకరత్న ఆరోగ్యం గురించి స్పెషల్ ట్వీట్ చేసిన మెగాస్టార్..!

-

నందమూరి తారకరత్న పరిస్థితి ఇప్పుడు రోజురోజుకు మరింత విషమంగా మారుతోంది. ఇదే విషయంపై అటు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా కలవర పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ఇటీవల యువగలం పేరిట ఏర్పాటు చేసిన పాదయాత్రలో భాగంగా తారకరత్న నారా లోకేష్ కి మద్దతు పలుకుతూ కొంతదూరం పాదయాత్ర చేశారు. అయితే ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే కుప్పంలోని హాస్పిటల్ కి తరలించగా అక్కడ హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.. వెంటనే మెరుగైన చికిత్స కోసం భార్య అలేఖ్య రెడ్డి కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.

- Advertisement -

దాదాపు పదిమంది ప్రత్యేక వైద్య బృందంతో తారకరత్నకు ట్రీట్మెంట్ జరుగుతోంది అని.. తాజాగా ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా తారకరత్నను సందర్శించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ట్విట్టర్ వేదికగా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేయడం జరిగింది.

ఈ క్రమంలోనే చిరంజీవి తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా.. “సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంకా ఏ మాత్రం ప్రమాదం లేదు అనే మాట చాలా ఉపశమనాన్ని ఇచ్చింది. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.. ఈ పరిస్థితుల నుండి కాపాడిన ఆ డాక్టర్లకి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...