మొదటిసారి అలాంటి పాత్రలో మెహ్రీన్.. సక్సెస్ అవుతుందా?

-

మొదట్లోనే మంచి స్పీడ్ చూపించిన మెహ్రీన్ ఆ తర్వాత జోరు తగ్గించిందని చెప్పాలి. సినిమాలలో అవకాశాలు తగ్గడం అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కూడా కలతలు ఏర్పడడంతో అటు సినిమాలకే కాదు ఇటు సోషల్ మీడియాకి కూడా కొంచెం దూరం మైంటైన్ చేస్తూ వస్తోంది. అలా చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెడుతున్న ఈ ముద్దుగుమ్మ కృష్ణగాడి వీరప్రేమగాధ , రాజా ది గ్రేట్ లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. ఇక అదే సమయంలో పెళ్లి కబురు చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఈమె.. ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాకుండానే.. నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది.

ఇక ఈలోగా నెక్స్ట్ జనరేషన్ బ్యూటీ లు స్పీడ్ పెంచడంతో మెహ్రీన్ కి కాస్త అవకాశాలు తగ్గిపోయాయి.
ఎఫ్2 సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎఫ్ 3 సినిమాతో మళ్లీ తన కెరియర్ ను తిరిగి గాడిలో పెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఫెయిల్ అవ్వడంతో మెహ్రీన్ కెరియర్ మళ్ళీ కష్టాల్లో పడింది. దాంతో లాంగ్ బ్రేక్ వచ్చేసింది. ప్రస్తుతం ఈమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

మరొకవైపు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి మెహ్రీన్ కి సంబంధించి వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. అసలు విషయం ఏంటంటే.. మొదటిసారి ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ హార్రర్ థ్రిల్లర్ మూవీలో నటించబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మెహ్రీన్ ఈ సినిమాలో మొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ మేరకు మళ్లీ తన కెరీర్ ను గాడిలోకి తీసుకొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news