సిర్పూర్ నుంచి పోటీ చేస్తా : RS ప్రవీణ్‌ కుమార్ ప్రకటన

-

RS ప్రవీణ్‌ కుమార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని… BJP, BRS పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప అనుచరులు రాజ్యాంగేతర శక్తిగా మారి అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సిర్పూర్ గడ్డను వలస వాదుల- దోపిడి దొరల నిరంకుశ పాలన నుండి విముక్తం చేసే దాకా విశ్రమించేది లేదన్నారు. తెలంగాణపై మీరు అధికారంలో ఉన్న కేంద్రం వివక్ష చూపుతుందని ఆగ్రహించారు. విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదు. విభజన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్,పార్టీ ఎంపీలు, ఇతర ఎంపీలు పార్లమెంట్ లో ఏనాడూ కేంద్రంపై పోరాటం చేయలేదు? అని ఫైర్‌ అయ్యారు RS ప్రవీణ్‌ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news