మ్యారిటల్ రేప్​ను సె** సీన్స్ అంటారా.. మెహరీన్ ఎమోషనల్ పోస్టు

-

శృంగార సన్నివేశాల్లో నటించడం తన నటనలో భాగమని టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ తెలిపింది. తను నటించిన ఓ వెబ్​ సిరీస్​లో మ్యారిటల్ రేప్ సీన్స్​ను నెటిజన్లు సె**  సీన్లుగా అభివర్ణించడం తనకు బాధ కలిగించిందని తెలిపింది. సుల్తాన్ ఆఫ్ దిల్లీ అనే వెబ్ సిరీస్​లో తన పాత్ర.. సె** సీన్​పై నెటిజన్ల రియాక్షన్​పై మెహరీన్ తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

సుల్తాన్ ఆఫ్‌ దిల్లీ’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చానని.. అది చూసి తన ఫ్యాన్స్ సంతోషిస్తారనుకుంటున్నానని మెహరీన్ ట్వీట్ చేసింది.   కొన్ని సార్లు స్క్రిప్ట్‌ కోసం మన సొంత భావాలకు విరుద్ధంగా నటించాల్సి వస్తుందని.. నటనను ఒక కళగా, ఉద్యోగంగా భావించే నటులు కథలో భాగంగా కొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉంటుందని ట్వీట్​లో పేర్కొంది.. శృంగార సన్నివేశాల్లో నటించడం కూడా అందులో ఓ భాగమని… ఈ సిరీస్‌లో దిల్లీ సుల్తాన్‌ క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే సన్నివేశం ఉందని చెప్పింది. మ్యారిటల్ రేప్ వంటి తీవ్రమైన సమస్యను మీడియాలో చాలా మంది ఒక శృంగార సన్నివేశంగా అభివర్ణించడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రపంచంలో చాలా మంది మహిళలు మ్యారిటల్ రేప్​ను ఎదుర్కొంటున్నారు. ఇది ఓ చిన్న విషయమని అనుకుంటున్నారు. సోషల్‌మీడియాలో కూడా దీని గురించి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దాన్నిలా ట్రోల్ చేయడం నాకు బాధగా అనిపించింది.  మహిళలతో క్రూరంగా ప్రవర్తించడం, వారిని హింసించడం నా దృష్టిలో ఒక అసహ్యకరమైన చర్య.  నటిగా నేను ప్రతి పాత్రకు న్యాయం చేయాలనుకుంటా. మహాలక్ష్మి, సంజన, హనీ.. ఇలా ఏ పాత్రలోనైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తాను’’ అని మెహరీన తన ట్వీట్​లో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news