చీరకట్టులో పాలధారలా మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ తమన్నా.. ఫొటోస్ వైరల్..!

-

2005 లో శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా పాలధార లాంటి చర్మ సౌందర్యాన్ని చూసి మంత్రముగ్గలవని వ్యక్తులు ఉండరు అనడంలో సందేహం లేదు. ఇక కాలేజీ అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో నటించిన తమన్నా.. ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అందరి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ రేసుగుర్రంలా దూసుకుపోతోంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈమె చేతిలో మరో మూడు, నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్లో రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే కాదు తెలుగులో కూడా చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో పాటు విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేరళలో సందడి చేస్తోంది.

ఇక ఈ క్రమంలోనే అక్కడి ప్రకృతి రమణీయ నడుమ చేసిన ఇన్ స్టా రీల్స్ ను పోస్ట్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సిల్వర్ కలర్ శారీ ధరించిన తమన్నాను చూసి పాలధారలా ఈమె అందం ఒలికి పోతుంది అంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇక అందానికే అసూయ కలిగించేలా ఉంది ఈ ముద్దుగుమ్మ. వయ్యారంగా హోయలు పోతూ ఈమె చేసిన రీలు ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version