సంచలనాలకి మారుపేరుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ, మర్డర్ పేరుతో కొత్త సినిమాని తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన వర్మ, డిసెంబరు 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఐతే ప్రమోషన్ల కోసం మిర్యాల గూడ నటరాజ్ థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి సంకల్పించాడు. ఐతే సడెన్ గా మిర్యాలగూడ పోలీసులు వర్మకి షాకిచ్చారు.
నటరాజ్ థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి అనుమతి లేనందున అడ్డుకున్నారు. దాంతో ప్రెస్ మీట్ జరగలేదు. ఈ ప్రెస్ మీట్ కారణంగా అనుచిత కార్యక్రమాలేమైనా రూపుదిద్దుకుంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు అడ్డుకున్నారట. ఈ నేపథ్యంలో వర్మ ట్వీట్ చేస్తూ ప్రెస్ మీట్ మరికొద్ది రోజుల్లో ఉంటుందని, మిర్యాల గూడ ఎస్పీ గారికి థ్యాంక్స్ తెలిపాడు. మర్డర్ సినిమాలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.