గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్‌.. ‘మీర్జాపూర్‌ 3’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

-

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ ఒకటి. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు భారీ వ్యూస్తో రికార్డు కూడా సృష్టించాయి. ఇక మూడో సీజన్‌ ‘మీర్జాపూర్‌ 3’ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ టీమ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం మీర్జాపూర్-3 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అమెజాన్‌ విడుదల చేసింది.

ముంబయిలో జరిగిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. దీని టీజర్‌ను విడుదల చేయగా  అది చూసి ఫ్యాన్స్‌ ఖుష్ అవుతున్నారు. ‘గుడ్డూ భయ్యా మళ్లీ వచ్చేశాడు’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. త్వరలోనే ఈ సీజన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన దీని తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version