పిఠాపురం నియోజకవర్గ ఎన్నిక నేపద్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పిఠాపురం నుండి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాకినీడు శేషు కుమారి జనసేన పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇక అటు పిఠాపురం నియోజకవర్గ పోటీపై కీలక ప్రకటన చేశారు టిడిపి నేత వర్మ.
పవన్ కళ్యాణ్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాజాగా ప్రకటించారు వర్మ. అమిత్ షా సూచిస్తే కాకినాడ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తానని… పిఠాపురం లో ఉదయ్ బరిలో ఉంటారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యాఖ్యలకు టిడిపి నేత వర్మ స్పందించారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు వర్మ. ఒకవేళ కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే… ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యేగా నేను నిలబడతానని వెల్లడించారు. దీంతో పిఠాపురం రాజకీయాలు ఒక్కసారిగా హిట్ ఎక్కాయి.