ప్రభాస్‌తో సినిమా మిస్.. ఆ రోజు చాలా బాధపడ్డా : రకుల్ ‌ప్రీత్

-

పాన్ ఇండియా స్టార్ హీరోతో నటించే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధపడినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది.గతంలో ఆమె నటించిన తెలుగు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు క్రమంగా తగ్గాయి. దీనికి తోడు రాష్ట్రంలో కలకలం సృష్టించిన డ్రగ్స్ వినియోగం కేసులో రకుల్ పేరు రావడంతో ఆమె హైదరాబాద్‌ను వీడాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ప్రభాస్‌తో నటించే సినిమా అవకాశం వచ్చినా అనుకోకుండా దానిని మిస్ అవ్వాల్సి వచ్చిందని పేర్కొంది.‘ నా కెరీర్ ప్రారంభంలో ఓ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశాను. అనంతరం ఢిల్లీ వెళ్లా.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి నాకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. నా స్థానంలో వేరేక వ్యక్తిని తీసుకున్నారని తర్వాత తెలిసింది. ప్రభాస్‌తోనే చేయాల్సిన మరో మూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు’ అని రకుల్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version