పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ఇవాళ యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. మొన్న విడుదలైన బీమ్లా నాయక్ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నేను పాట పాడకుంటే ఎవరికీ తెలిసి ఉండేవాడిని కాదు. ఇంత పేరు వచ్చేది కాదు అని మొగులయ్య పేర్కొన్నారు.
ఈ సినిమాలో పాట పాడిన తరువాత నాకు పవన్ కల్యాణ్ సన్మానం చేసి, లక్ష రూపాయలు నగదు కూడా ఇచ్చరని.. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇల్లు ఇచ్చి, సన్మానం చేసి రూ.కోటి సాయం అందించారని పేర్కొన్నారు. భీమ్లానాయక్ పాట పాడిన తరువాత నాకు గొప్ప పేరు వచ్చింది. ఈ పేరు రావడానికి పవన్ కల్యాణ్ కారణమన్నారు. ఇందులో పాట పాటడం నా అదృష్టం. ఈ సినిమాలో పాట పాడిన తరువాత ఢిల్లీలో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నాతో అందరూ సెల్పీలు దిగుతున్నారు. నన్ను గొప్పగా తయారు చేయడానికి ఈ సినిమాలోని పాటనే కారణమన్నారు. థమన్ సార్ నాతో తప్పు పోయినా పాట పాడించారని చెప్పారు. అదేవిధంగా ఏదైనా మరల పాట పాడటానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరారు. మొగులయ్య మాట్లాడిన తరువాత స్టేజీ పై మరొకసారి ఆడకాదు.. ఈడకాదు.. అనే సాంగ్ పాడారు. అదేవిధంగా మొగులయ్య పాటలపై ఓ విద్యార్థి పీహెచ్డీ చేస్తున్నట్టు ప్రకటించారు. స్టేజీపై ఉన్న ప్రతి ఒక్కరూ మొగులయ్యను కొనియాడారు.