Mohanlal: దాతృత్వాన్ని చాటుకున్న స్టార్ హీరో..స్టూడెంట్స్‌కు ఫ్రీ ఎడ్యుకేషన్

-

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటనలో విలక్షణతను చూపి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మలయాళీలు ఆయన్ను లాలెటా అని పిలుస్తుంటారు. రీల్ లైఫ్ అనగా సిల్వర్ స్క్రీన్ పైన మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో నూ మోహన్ లాల్ విలక్షణంగా జీవిస్తారు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో ఫార్మింగ్ పైన ఫోకస్ చేసిన కంప్లీట్ యాక్టర్..తన ఇంటికి అవసరమయ్యే కూరగాయలను పొలంలోనే పండించడం స్టార్ట్ చేశాడు.

ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తన వంతుగా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు మోహన్ లాల్. అలా చాలా సార్లు చాలా మందికి హెల్ప్ చేసిన మోహన్..తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని గిరిజన తెగకు చెందిన ఇరవై మంది విద్యార్థులకు పదిహనేళ్ల పాటు ఉచిత విద్య అందిస్తానని చెప్పారు. ‘విశ్వశాంతి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వారి చదువుకు అయ్యే ఖర్చులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతీ ఏడాది ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మోహన్ లాల్. మోహన్ లాల్ చేస్తున్న కృషిని ప్రముఖులతో పాటు విషయం తెలుసుకున్న వారు అభినందిస్తున్నారు. మోహన్ లాల్ తెలుగులో సూపర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’లో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం మోహన్ లాల్ ‘ట్వెల్త్ మ్యాన్, ఎలోన్, మాన్ స్టర్, బరోజ్, ఎంపురన్’ చిత్రాల షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news