టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఈ రామ్-కామ్ ను మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు మాత్రం తెగ ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కూడా ప్రేక్షకులు ఈ మూవీని గుర్తుపెట్టుకునేందుకు తరచూ ఓ అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా సినీ లవర్స్‌కు ఈ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఆగస్టు 4న అనుష్క శెట్టి.. మిస్టర్ పొలిశెట్టితో థియేటర్లలో సందడి చేయనుందట. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.