Animal : నటిని పెళ్లి చేసుకున్న ‘యానిమల్’ నటుడు

-

‘యానిమల్’ యాక్టర్ కునాల్ ఠాకూర్, ‘లస్ట్ స్టోరీస్-2’ ఫెమ్ ముక్తి మోహన్ ఒక్కటయ్యారు. ఢిల్లీలో వీరి వివాహం సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ మేరకు వివాహ ఫోటోలను వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ‘కబీర్ సింగ్’ సినిమాలోను కునాల్ నటించారు. మరోవైపు ముక్తి తెలుగులో రవితేజ ‘దరువు’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు.

Mukti Mohan ties the knot with Animal actor Kunal Thakur

కాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీసిరీస్ నిర్మించిన చిత్రం యానిమల్. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబి డియోల్, తెలుగు నటులు బబ్లు పృథ్విరాజ్, మాగంటి శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని.. భారీ వసూళ్లు కూడా రాబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news