Hbd special: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

-

‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాళ్లే’ అంటూ స్పెషల్‌ సాంగ్‌తో డ్యాన్సర్‌గా తన గ్లామర్‌తో సిల్వర్‌ స్ర్కీన్‌ను షేక్‌ చేసిన సెన్సేషనల్‌ బ్యూటీ ఆమె.. గుర్తింపున్న పాత్రల్లో కూడా నటించి యువ హృదయాల్లో కాకరేపిన హాటీ.. ఆమే కుర్రాళ్ల దిల్‌ఖా జాన్‌ ముమైత్‌ ఖాన్. నేడు ఆమె పుట్టినరోజు కొన్ని విశేషాలతో పాటు ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో తెలుసుకుందాం..

ముమైత్ ఖాన్

ముమైత్‌ ఖాన్.. తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారుండేవారు. ఏందుకంటే ఐటమ్ సాంగ్స్​లో మురిపించిన తీరును ఇప్పటికీ అభిమానులు తలచుకొని ఆనందిస్తూనే ఉన్నారు. అంతలా ఐటమ్స్ లో అలరించిన ముమైత్ కొన్ని చిత్రాలలో కీలక పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ముమైత్ ఖాన్

 

ముమైత్ ఖాన్ 1985 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆమె పుట్టి, పెరిగింది ముంబయిలోనే. ఆమె తల్లి స్వస్థలం చెన్నై. తండ్రి పాకిస్థానీ. మొదటి నుంచీ అందాలతో కనువిందు చేయడానికే సై అంది ముమైత్. దాంతో ఆమెను ఐటమ్ నంబర్స్ మాత్రమే పలకరిస్తూ వచ్చాయి. ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్.’తో మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రసీమలో హరికృష్ణ నటించిన ‘స్వామి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

 

తమిళ, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లో తన నర్తనంతో మత్తెక్కించింది. పూరి జగన్నాథ్ చిత్రాలు “1 4 3, పోకిరి” ముమైత్ కు తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అంటూ ‘పోకిరి’లో ముమైత్ చిందేసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక ‘యోగి’లో “ఓరోరి యోగి…”అంటూ మురిపించిన వైనాన్ని గుర్తు చేసుకొని మరీ చిందులేసే వారున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ముమైత్ నడుముతో నాట్యం చేసిన విధానం తరువాతి రోజుల్లో ఎంతోమంది నర్తకీమణులు అనుసరించేలా చేసింది. ఇక ‘మగధీర’లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకొని అలరించింది ముమైత్. “ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపియస్, మంగతాయారూ టిఫిన్ సెంటర్, పున్నమినాగు” వంటి చిత్రాలలో ముమైత్ ఖాన్ కీలకమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ కే పరిమితమై ‘ఐటమ్ గాళ్’ గానే గుర్తింపు సంపాదించారు ముమైత్. తెలుగునాటనే ఆమెలోని నటికి మంచి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు. ‘హెజా’ అనే తెలుగు చిత్రంలో ఆమె నటిస్తోంది. ఏది ఏమైనా ముమైత్ మురిపించిన తీరును జనం అంత త్వరగా మరచిపోలేరని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version