స్ఫూర్తి: ఐడియా ముగ్గురి జీవితాన్ని మార్చేసింది.. ఆరేళ్లలో రూ.75 కోట్ల టర్నోవర్ తెచ్చింది..!

-

జీవితంలో ఎందులోనైనా సక్సెస్ అవ్వాలంటే దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. అలానే సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం అందుకోగలము. వ్యాపారంలో కూడా అంతే. చక్కగా ఒక మంచి ఆలోచనను ముందుకు తీసుకువెళుతూ ప్లానింగ్ తో పాటు చక్కగా అనుసరిస్తే కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు. చాలా మంది వ్యాపారాలు చేయాలి అనుకుంటారు కానీ మధ్యలోనే ఇబ్బందుల వల్ల వాటిని వదిలేస్తూ ఉంటారు.

కానీ ఈ ముగ్గురు మాత్రం ఒక మంచి ఐడియా తో చక్కటి ప్లానింగ్ తో ముందుకెళ్లి అద్భుతంగా వ్యాపారంలో రాణిస్తున్నారు రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం లోకి వచ్చి 75 కోట్ల రూపాయల టర్నోవర్ ని సాధించారు. మరి వారి కోసం వారి వ్యాపారం కోసం ఇప్పుడు చూద్దాం.

హిమాన్షు చావ్లా, శ్రే సెహగల్, సుమన్ పాత్రా ముగ్గురు న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ ఉద్యోగాలు చేశారు. తర్వాత ముగ్గురు కలిసి 2010లో ఆన్లైన్ ద్వారా పువ్వులు కేకులు వంటివి సప్లై చేసే ఫ్లవర్ ఆరా అనే సంస్థని మొదలుపెట్టారు.

మొదట వీళ్ళు గురుగ్రామ్ లో ఈ బిజినెస్ ని స్టార్ట్ చెయ్యగా మంచి స్పందన వచ్చింది. 2010 ఫిబ్రవరిలో వాళ్లు ఈ వ్యాపారం మొదలుపెట్టారు. పెట్టుబడిగా రెండు లక్షల రూపాయలుని పెట్టడం జరిగింది. ఫ్లవర్ ఆరా ద్వారా మంచిగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.

అలానే కేకులు కూడా వీళ్ళు సప్లై చేసేవారు. క్లౌడ్ కిచెన్ మోడల్ లో 11 నగరాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. క్వాలిటీని మెయింటెన్ చేసుకుంటూ వెళుతున్నారు అయితే కొన్ని ప్రాంతాలలో అవుట్లెట్లు చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇలా ఒక మంచి ఐడియా ద్వారా ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వ్యాపారం మొదలు పెట్టి ఏకంగా 70 కోట్లకు టర్నోవర్ చేరుకున్నారు ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version