హుక్కా బార్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్‌ ఫరూఖీ

-

స్టాండప్‌ కమెడియన్‌, బిగ్‌బాస్‌ విన్నర్ మునావర్ ఫరూఖీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటాడు. తాజాగా మరోసారి వివాదాల్లో నిలిచాడు. ముంబయిలోని హుక్కా బార్‌లో సోదాలు చేసిన పోలీసులు అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఫోర్ట్ ఏరియాలో చట్టవిరుద్ధంగా నడుపుతోన్న హుక్కా పార్లర్‌లో మంగళవారం రోజు రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సోదాలు జరిపిన అధికారులు.. కొంత మొత్తంలో నగదు, కొన్ని హుక్కా పాట్స్‌ను సీజ్‌ చేశారు.

దాడుల్లో భాగంగా మునావర్ ఫరూఖీ, మరికొందరు హుక్కా పీలుస్తున్నట్లు తమ సిబ్బంది గుర్తించారని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారిపై మోపిన సెక్షన్లు బెయిల్‌ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండటంతో, నోటీసులు ఇచ్చి, విడుదల చేశామని వివరించారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ అతడి షోపై ఫిర్యాదులు అందడంతో 2021లో నెలరోజుల పాటు మునావర్ ఫారూఖీ జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version