ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు. ఏకంగా తరగతి గదులకు మొత్తం రైలు బోగీల కలర్స్ వేశారు. మొత్తం ట్రైన్ థీమ్ వలే పెయింటింగ్స్ చేయించారు. దీనివలన అనుకున్న విధంగానే అడ్మిషన్స్ పెరిగాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఈ ఘటన కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామంలో వెలుగుచూడగా.. అక్కడి ప్రభుత్వ స్కూల్‌కు ట్రైన్ థీమ్ పెయింటింగ్ చేయించారు.అది చూసేందుకు అచ్చం ట్రైన్ లాగే ఉంది. దీంతో అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/telanganaawaaz/status/1894345555587076139