ఐదు రోజుల్లోనే అద్భుతాన్ని చూసాను.. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీపై నటుడు మురళి శర్మ….!!

-

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. కాగా కేరళలో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి గారు చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె భారతి అనే ప్రొఫెసర్ రోల్ లో నటిస్తున్నట్లు ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అవడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నటుడు మురళి శర్మ, నిన్న మీడియాతో మాట్లాడుతూ, తాను 2007లో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ మహేష్ నటించిన అతిథి సినిమాతో ఎంటర్ అవ్వడం జరిగిందని అన్నారు. అయితే ఆ తరువాత నుండి మరొక్కసారి మహేష్ గారి ప్రక్కన యాక్ట్ చేసే అవకాశం తనకు రాలేదని, అయితే మళ్ళి ఇన్నేళ్లకు అనిల్ రావిపూడి గారు తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు ద్వారా మహేష్ గారితో కలిసి నటించానని అన్నారు. అయితే నేను ఫస్ట్ సినిమా మహేష్ గారితో చేసినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అదే విధమైన గ్లామర్ తో ఉన్నారని, అలానే తన తోటి ఆర్టిస్టులకు మహేష్ గారు ఇచ్చే గౌరవం ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు.
ఇక ఈ సినిమాలో తనది చిన్న పాత్రేనని, కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన తాను, ఈ ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్తున్నారని, తన ఐదు రోజుల షూటింగ్ లోనే ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని భావించినట్లు చెప్పారు. అయితే మురళి శర్మ మాట్లాడిన ఈ వార్త వీడియోని సరిలేరు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version