Naa Saami Ranga : “నా సామిరంగా” టీజర్‌ రిలీజ్‌..రచ్చ చేసిన నాగ్‌

-

Naa Saami Ranga : అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘నా సామిరంగ’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Naa Saami Ranga Teaser
Naa Saami Ranga Teaser

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే.. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న “నా సామిరంగ” సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో అల్లరి నరేష్ “అంజిగాడు” అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ఇక ఇవాళ ‘నా సామిరంగ’ సినిమా టీజర్‌ కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇందులో నాగార్జున ఇరగ దీశాడు. అటు అల్లరి నరేష్ కూడా ఊపేశాడు. అషిక రంగనాథ్ అందాలు ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news