గ్రాండ్​గా ‘కల్కి’ 50డేస్ సెలబ్రేషన్స్.. నాగ్ అశ్విన్ వీడియో వైరల్

-

రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి ఏడీ 2898’ గురువారానికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 50 డేస్ సెలబ్రేషన్స్ గ్రాండ్​గా జరిగాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్​ సంధ్య థియేటర్ లో నిర్వహించిన సెలబ్రేషన్స్​లో డైరెక్టర్​ నాగ్ అశ్విన్ ఫ్యామిలీతోపాటు పాల్గొన్నారు.  అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు.

ఫ్యాన్స్​తోపాటు నాగ్ అశ్విన్ కేరింతలు కొడుతూ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ రాగానే సామాన్య అభిమానిలాగా చీటీలు ఎగరేస్తూ సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ యాజమాన్యం ఆయన్ను శాలువాతో సత్కరించింది. అనంతరం అశ్విన్ భారీ కేక్ కట్ చేసినవీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోలను ఫుల్ షేర్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ చేసిన హంగామాను చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక కల్కి సినిమా కలెక్షన్లలో పలు రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version